
జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్, మార్చి 16:
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్షలు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధాన కార్యక్రమం స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదానాయక్, మండల కార్యదర్శి వీరన్న నాయక్ విద్యార్థులను నిర్దేశించి మాట్లాడుతూ..
పదో తరగతి విద్యార్థులలో భవిష్యత్తులో జరగబోయే కామన్ ఎగ్జామ్స్ కు విద్యార్థులలో భయాన్ని పోగొట్టడం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ అధ్యయన పోరాట నినాదంతో విద్యార్థులలో మనోధైర్యాన్ని నింపడం కోసం ఇలాంటి ప్రతిభ పరీక్షలు నిర్వహించడంజరిగింది. ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ కమిటీకి అభినందనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దేశంలో కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థు లందరూ కలిసి నూతన జాతీయ విద్యా విధానం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలో బిల్లును తీసుకొచ్చి పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువులను దూరం చేయడం న్యాయం కాదని అన్నారు. విద్యార్థు లందరూ …
కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకున్నప్పుడే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ కార్యదర్శి జగన్ నాయక్, బాలికల గిరిజన పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి,వైస్ ప్రిన్సిపాల్ సుజాత,రజిత, బాలు నాయక్,అజయ్, ఉపేందర్,తరుణ్,అఖిల్, తదితరులు పాల్గొన్నారు





