
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 12 :
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ అసెంబ్లీ బిజెపి మహిళామోర్చ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన “సుష్మాస్వరాజ్ అవార్డుల “ప్రదానోత్సవం జరిగింది. “అంతర్జాతీయ మహిళ దినోత్సవ వారోత్సవ” సందర్భముగా నేడు మిర్యాలగూడ పట్టణంలోని కే ఎల్ ఎన్ బాలికల జూనియర్ కళాశాలలో బిజెపి మహిళ మోర్చా నల్లగొండ జిల్లా అధ్యక్షురాలు కొండేటి సరిత అధ్యక్షతన మిర్యాలగూడ పట్టణంలోని వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళ నిపుణులకు “సుష్మాస్వరాజ్ అవార్డులతో”సన్మానం చేయటం జరిగినది.సుష్మాస్వరాజ్అవార్డులు అందుకున్న మహిళలు… టి .స బిత, ఏ ఎస్ ఐ ఆదిలక్ష్మి,కానిస్టేబుల్ పందిరి సత్యప్రభ, ఎండిఓ కార్యాలయ సూపర్డెంట్ బి.శ్రీదేవి,అడ్వకెట్ భాగ్యలక్ష్మి, రిటైర్డ్ టీచర్, లైన్స్ క్లబ్ మౌనిక ,జనసేవ పార్టీ జాతీయకార్యదర్శి మాలతి, కేఎల్ఎన్ కాలేజీ విద్యార్థిని ఐ ఐ టి ర్యాంకర్ మౌనిక, తదితర మహిళలను “కొండేటి సబిత” మహిళలతో కలిసి వీరిని సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నాయకులు సాధినేని శ్రీనివాసరావు,జిల్లాఉపాధ్యక్షులు రేపాల పురుషోత్తం రెడ్డి, మిర్యాలగూడ నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ రతన్ సింగ్ నాయక్ ,సీతా రాంరెడ్డి,కొండేటి శేఖర్,రవికుమార్, బిజెపి మహిళా నాయకురాలులు.. రేణుక,యాదమ్మ,భాగ్యమ్మ,అరుణ,లక్ష్మి,.. లు,తదితరమహిళలు,బిజెపి నాయకులు తదితరులు పాల్గోని కొండేటి సరితను శాలువాతో సత్కరించి సన్మానించడం జరిగింది.






