జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి .శ్రీనివాస్, పినపాక, మార్చి 13.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,పినపాక మండలం, పెంటన్నగూడెం గ్రామానికి చెందిన సల్లూరు జ్యోతి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా పినపాక మండల నేతకాని సంఘం అధ్యక్షుడు గుమాస్ గోవర్ధన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితురాలికి రూ. 5000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా సంఘo నాయకులు మాట్లాడుతూ సల్లూరి జ్యోతి కుటుంబం ఇప్పుడు పేదరికంలో ఉన్నదని కనీసం మందులు కొనుక్కోవడానికి కూడా పైసలు లేని పరిస్థితులలో ఉన్నారని అన్నారు. కావున దాతలు మానవత్వంతో ఆ కుటుంబానికి తోచిన సహాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిఎన్ఎమ్ఈఓ జిల్లా అధ్యక్షుడు గుమాస లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి జిమ్మిడి శివశంకర్, పినపాక మండల నాయకులు జాడి రాంబాబు ఆర్.ఎం.పి, జాడి కిరణ్, జిమ్మిడి వెంకటేశ్వర్లు ,గుమాస్ వెంకటేశ్వర్లు, గుమాస్ శంకర్, గుమాస్ సురేందర్, జాడీ శ్రీనివాస్, కొండ గొర్ల రమేష్, గుమాస్ నరసింహా రావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.