
జన సముద్రం న్యూస్, మార్చి 11,అనంతపురం.
మరణించిన పరిశోధన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి..
ప్రభుత్వం తక్షణమే విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నటువంటి ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్లు ఇవ్వాలి.
విద్యార్థి ఆత్మహత్యకు కారుకులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి.
విశ్వవిద్యాలయం నందు గత కొన్ని రోజుల కిందట పరిశోధన విద్యార్థుల వసతి గృహ పై భాగాన గణిత శాస్త్రంలో పరిశోధన చేస్తున్నటువంటి ఆంజనేయులు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అక్కడే ఉన్న కొంతమంది విద్యార్థులు ఆ విద్యార్థినిని హాస్పిటల్కు తరలించడం జరిగింది. వైద్యం అందిస్తున్న సమయంలోనే నిన్న రాత్రి ఆ విద్యార్థి మరణించడం జరిగింది ఈ విషయం విశ్వవిద్యాలయంలోని విషాదాన్ని నింపడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్కే యూనివర్సిటీ ప్రధాన ముఖ ద్వారం నందు ఆ విద్యార్థికి ఆత్మకు శాంతి చేకూరాలని పెద్ద ఎత్తున విద్యార్థులతో సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఏ ఐ యస్ ఏ రాష్ట్ర అధ్యక్షులు వేమన మాట్లాడుతూపరిశోధన విద్యార్థి మరణించడం చాలా బాధాకరమని ఆ విద్యార్థి కొన్ని రోజుల నుంచి విశ్వవిద్యాలయంలో అనేక సమస్యలను ఎదుర్కొని చివరకు ఇలా చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే విశ్వవిద్యాలయంలో ఈ ప్రభుత్వము వచ్చినప్పటి నుండి ముఖ్యంగా విశ్వవిద్యాలయానికి రామకృష్ణారెడ్డి ఉపకులపతి పదవి చేపట్టినప్పటి నుండి విద్యార్థులను వివిధ రకాలుగా వేధిస్తూ వారిని సమస్యలకు గురి చేయడం జరిగింది ముఖ్యంగా పరీక్ష ఫీజుల నుంచి వసతి గృహాల ఫీజుల వరకు వేలాది రూపాయలు పెంచుకుంటూ పోవడమే ఇలాంటి సంఘటనలకు దారి తీయడం జరుగుతుంది ఇవి కాకుండా పరిశోధన చేసే విద్యార్థులకు అదున్నపు భారాన్ని మోపుతూ వారిని మానసికంగా వేధించడమే అని పెట్టుకోవడం విశ్వవిద్యాలయంలో ఆచార్యులు చేస్తున్న పనిని గమనించవచ్చు ఏది ఏమైనా వైస్ ఛాన్స్లర్ రామకృష్ణారెడ్డి మాత్రం విద్యార్థులను పని పెట్టుకొని మరి వివిధ రూపాలలో వేధించడమే తన కర్తవ్యం అంటూ ముందుకు పోవడాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(AISA) పూర్తిగా ఖండిస్తుంది.
వర్సిటీలో ఉపకులపత్తికి వత్తాసు పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి బోధన సిబ్బంది కూడా ఆయన దారిలో నడుస్తూ విద్యార్థులను విపరీతంగా వేధిస్తూ వారిని మీకు హాజరు శాతం లేదంటూ మీరు తరగతిలో హాజరు కాలేదంటూ వివిధ రకాల వేధింపులతో విద్యార్థులను విశ్వవిద్యాలయాల్లో చేరకుండా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మరణించిన విద్యార్థి ఆంజనేయులు గణిత శాస్త్రంలో పరిశోధన చేస్తున్నాడు గమనించవచ్చు ఈ విద్యార్థి గత కొన్ని రోజుల కిందట తన విభాగానికి వెళ్లి తన సూపర్వైజర్ అయినటువంటి శోభలత గారిని ప్రీ ,పిహెచ్డీ ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంగా తనకు కూడా అవకాశం ఇవ్వాలంటూ వేడుకోవడం జరిగింది కానీ కానీ ఆమె వివిధ కారణాలు చూపిస్తూ ముఖ్యంగా నీకు హాజరు శాతం లేదంటూ అవకాశం ఇవ్వలేదు అదేవిధంగా వసతి గృహంలో కూడా విద్యార్థి భోజన సమయానికి వెళితే మీరు ఫీజులు కట్టలేదు కాబట్టి మీరు తినడానికి వెళ్లేదంటూ విద్యార్థిని ఆ హాస్టల్ డిప్యూటీ వార్డెన్ అనేకమార్లు అడిగినందుకు అతను మనస్థాపానికి కూడా గురి కావడం జరిగింది వీటన్నింటి గమనిస్తే విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు సరైన అవకాశాలు లేక వారు ఏదో సాధిస్తామంటూ ఆశలు పెట్టుకొని చదవడం జరుగుతుంది కానీ ఇలాంటివి విశ్వవిద్యాలయంలో అధికారులు చేస్తున్న అవగాహన రహిత ఆలోచన వలన విద్యార్థులు అనేక సమస్యలకు గురి కావడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ, పుల్లలరేవు.మంజునాథ్ మరియు పరిశోధన విద్యార్థులు ,రామకృష్ణ , యనమలప్రసాద్ ,ముని, పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు





