
జనసముద్రం ఉమ్మడి జిల్లాల ప్రతినిధి
బాన్సువాడ పట్టణంలోని డిఎస్పి కార్యాలయంలో శనివారం డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి చేతుల మీదుగా జన సముద్రం న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు ప్రభుత్వం ప్రజలకు మధ్య వారిదిగా పనిచేస్తాయని అన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా తీసుకొని వస్తుండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. జన సముద్రం న్యూస్ యాజమాన్యానికి, విలేకరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద ఎస్సై శ్రీధర్ రెడ్డి, జుక్కల్ ఎస్ఐ, సిబ్బంది, జనసముద్రం న్యూస్ ఉమ్మడి జిల్లాల ప్రతినిధి యం. హన్మండ్లు, సురేష్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.





