ఎక్సెలెంట్ హై స్కూల్ లో ఘనంగా ఫేరెవెల్ వేడుకలు.

Spread the love

*ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, పినపాక, మార్చి 10.

పినపాక మండలం లోని బయ్యారం క్రాస్ రోడ్ నందు గల ఎక్సలెంట్ బాషా హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన ఫెరెవెల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హాజరయ్యారు.తొలిత తొమ్మిది వ తరగతి, పదవ తరగతి విద్యార్థులు పాఠశాల యాజమాన్యం వారికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్బంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీకు పరీక్షల సమయం చాలా దగ్గరలో ఉన్నాయని,పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సిన అవసరం ఉందని అన్నారు.విద్య వ్యవస్థలో అందుబాటులో ఉన్న వనరుల ను సద్వినియోగం చేసుకోని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలని, ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అర్హత సాధిస్తారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి చదువులో బాగా రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని అన్నారు. చిన్నారులు కన్నుల విందు గా నృత్యాలు, ఆట పాటలతో తమ ప్రతిభను చూపించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ రాజగోపాల్, ఎస్ ఐ నాగుల్ మీరా, ఎక్సెలెంట్ గ్రూప్ అఫ్ స్కూల్స్ చైర్మన్ ఎండి యూసఫ్ షరీఫ్, ఎక్సెలెంట్ గ్రూప్ అఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ ఎండీ ఖాదర్, డైరెక్టర్స్ ఎండీ ఎండీ యాకుబ్ షరీఫ్, ఎండీ ఖాన్, ముక్కు నర్సారెడ్డి, బండారు నరేంద్ర, ప్రిన్సిపాల్ అంకం సురేష్ , సినీయర్ ఉపాధ్యాయురాలు వాల్సలా మోహన్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి