బి ఆర్ ఎస్ ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు తగదు: పగడాల సతీష్ రెడ్డి.

Spread the love

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, మార్చి 10.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని ఓర్వలేకనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో గల పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జురుగుతున్న అభివృద్దిని చూసి ప్రజలు బి.ఆర్. ఎస్ పార్టీని ఆదరించడం ఓర్వలేకనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సీబీఐని, ఈడీని ఉపయోగించి బెదెరెంపులకు పాల్పడుతుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పేద ప్రజలకు న్యాయం జరిగేలా అనేక సంక్షేమ పధకాలు అమలు పరుస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న బెదిరింపు దోరణి మానుకోవాలని పేద ప్రజలకు న్యాయం చేసేలా తెలంగాణ ప్రభుత్వానికి అడ్డుపడకుండా ఉండాలన్నారు.ఈ సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ,వైస్‌ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి,ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, సీనియర్ నాయకులు కోలేటి భవానీ శంకర్‌, అక్కిరెడ్డి సంజీవరెడ్డి, మదార్‌సాహెబ్‌, సర్పంచ్‌ గొగ్గలి నాగేశ్వరరావు, గొంది నాగభూషణం, వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి