
ఔదార్యం చాటిన ఉప్పాక యువత.
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, మార్చి 10.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, సీతారాంపురం పంచాయతీ పరిధిలో గల పెంటన్నగూడెం గ్రామానికి చెందిన సల్లూరి జ్యోతి(30) క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి విధితమే .గతంలో పలుమార్లు పత్రికల్లో వచ్చిన కథనాలకు దాతలు స్పందిస్తూ తమకు తోచిన సహాయాన్ని చేయడం జరుగుతుంది. బాధితురాలికి భర్త ప్రసాద్, ఇద్దరు పిల్లలు పావని 12, శెశి కుమార్ 10.వీరికి ఇంటిస్థలం లేదు,వుండటానికి ఇళ్ళు లేదు,పొరుగు ఇండ్లల్లో వుంటూ కూలి పనులకు వెళ్తూ పిల్లలను తిని తినక పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.ఆరు నెలల క్రితం కడుపునొప్పి రావడంతో హాస్పిటల్ కి వెళ్తే గర్భాశయ క్యాన్సర్ నాల్గవ దశలో వుందని చెప్పారు. కనీసం మందుల ఖర్చు లకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నరని తెలిసి ఉప్పాక గ్రామానికి చెందిన యువత 6000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మా అమ్మను బ్రతికించండి అంటూ వేడుకుంటున్న తీరు పలువురి ని కంటతడి పెట్టిస్తుంది. వైద్యానికి అయ్యే ఖర్చు భరించే స్తోమత లేకపోవడం కళ్ళముందు కన్నతల్లి అనారోగ్యంతో బాధపడుతుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం దాతల సహాయాన్ని కోరుతుంది.దాతలు ముందుకు వచ్చి సహాయం చేసి మా అమ్మను బ్రతికించవలసిందిగా కోరుతున్నారు. ఈ కార్యక్రమం లో కోడం రాము,కాలేవారి వెంకన్న, వెలదండి శ్రీహరి శ్యామల సతీష్, సిల్వేరు బాలకృష్ణ, గద్దల సాంబశివరావు వెబ్ ప్రవీణ్, బొగ్గుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.





