
జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, కరకగూడెం, మార్చ్ 9.
కరకగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,
పులుసుబోంత ప్రాజెక్ట్ ను స్థానిక ఎమ్మెల్యే రేగ కాంతారావు ముఖ్యమంత్రి కెసిఆర్ తో త్వరలో శంకు స్థాపన చెపిస్తాని చెప్పిన మాటలన్నీ ఏమయ్యాయని,ప్రాజెక్ట్ పేరుతో ప్రజలకి మాటలు చెప్పి, మభ్య పెట్టీ సర్వేలనీ, సమావేశాలు అని కాల యాపన చేయటం తప్ప, ఇప్పటి వరకు పులూసుబొంత ప్రాజెక్ట్ పనులు మాత్రం ప్రారంభం అయిన దాఖలాలు లేవని అన్నారు.పులుసుబొంత ప్రాజెక్ట్ యొక్క నిర్మాణానికీ నిధుల మంజూరు పై ప్రభుత్వ లేఖను బహిరంగంగా ప్రజలకు చూపించి పనులు మొదలు పెట్టాలని,
లేదంటే పులుసుబొంత ప్రాజెక్ట్ సాధనకై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండలాల నాయకులం అందరం కరకగూడెం మండల రైతులతో కలిసి ప్రాజెక్ట్ సాధించే వరకూ పోరాటాలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల మహిళా నాయకురాలు చందా వెంకట రత్నమ్మ, మండల కార్యదర్శి షేక్ రఫీ, బట్టుపల్లి సర్పంచ్ తోలెం నాగేశ్వరరావు, మండల నాయకులు బైరిషెట్టి రామారావు ,పోలేబోయిన సీతారాంబాబు తదితరులు పాల్గొన్నారు.





