నాడు – నేడు స్త్రీ పాత్ర మరువలేనిది: సింగరేణి జిఎం దుర్గం రాoచందర్.

Spread the love

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు ,మార్చి 9.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో మహిళలు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఏరియా జిఎం దుర్గం రామచందర్ అన్నారు.మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఇల్లందు క్లబ్ లో జరిగిన వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ అమ్మ అనే పదం చాలా పవిత్రమైనదనీ తెలుగు పదాలలో అమ్మకు ఎంతో విశిష్టత ఉన్నదని ఆ విశిష్టతను కాపాడుకుంటూనే నేడు మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నారని దీనికి నిదర్శనంగా ఐఏఎస్,లాయర్లు డాక్టర్ , అటవీ శాఖ, పోలీసు శాఖ,సైనికులు గా సమర్థవంతమైన అన్ని రంగాలలో రాణిస్తూనే అంతరిక్ష పరిశోధకులు, శాస్త్ర సాంకేతిక రాజకీయ రంగాలలో కూడా నేటి మహిళ ఎంతగానో ఉన్నత శిఖరాలను స్వశక్తి తో మరింత పురోగమించాలని మహిళ అభివృద్ధి తోటే దేశాభివృద్ధి సాధ్యమని అందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేదిక కావాలని ఆకాంక్షించారు .ఈ సందర్భంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.మహిళ ఆర్థిక సాధికారికత సాధించే దిశగా సింగరేణి కూడా కుట్లు, అల్లికలు, పోలీస్ రిక్రూట్మెంట్ శిక్షణ ఇతర వృత్తి విద్య శిక్షణలతో ఎంతగానో ప్రోత్సహిస్తుందని అలాంటి ప్రోత్సాహలను అందిపుచ్చుకోలని మహిళలను కోరారు.ఏరియా సేవా అధ్యక్షురాలు దుర్గం సుమతి రామచందర్ మాట్లాడుతూ నేటి సమాజంలో దేశాభివృద్ధిలో స్త్రీ పాత్ర ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని అయినప్పటికీ స్త్రీ జాతి ఇంకా ఎన్నో వేధింపులకు గురి అవ్వటం బాధాకరమన్నారు. ఇలాంటి అసమానతలను రూపుమాపేందుకు మహిళలు ఐక్యంగా అలుపెరుగని పోరాటం చేయాలని ఆమె కోరారు. మంచి సమాజాన్ని నిర్మించడంలో కూడా స్త్రీ పాత్ర మరువలేనిదని కొనియాడారు.లేడీస్ క్లబ్ సభ్యులు సేవా మహిళలు చక్కని సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా సింగరేణి హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఈజీ స్వరూప రాణి ని, మణుగూరు మున్సిపాలిటి పారిశుద్ధ్య కార్మికురాలు సిహెచ్ కనకమ్మను శాలువా, పుష్పగుచ్చం జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొని యాడారు .అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పలువురు మహిళలు, యువతులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఎంతగానో అలరించాయి.ఈ కార్యక్రమంలో డిజియం(పర్సనల్) యస్.రమేష్, టిబిజికేయస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రవూఫ్, సేవా సెక్రటరీ శ్రీమతి షాకిర , ఇల్లందు లేడీస్ క్లబ్ సెక్రటరీ డి అనిత లలిత్ కుమార్ , డి వై (ఎస్ ఈ) (సివిల్) రాజేంద్ర ప్రసాద్ , లేడీస్ క్లబ్ సభ్యులు, సేవా సభ్యులు, సింగరేణి ఉద్యోగుల మహిళలు,సన్మాన గ్రహీత ఈ జి యస్ స్వరూప రాణి,హెడ్ మిస్ట్రెస్,సింగరేణి హై స్కూల్ మరియు సి హెచ్ కనకమ్మ ,స్వీపర్,మునిసిపాలిటీ,మణుగూరు, సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్ , వీ రామేశ్వర రావు ,పి బి అవినాష్ , అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్వైజర్ జాన్ వెస్లీ, మాజీ సేవా కో ఆర్డినేటర్ ఎండీ యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి