
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 8 :
భారత విద్యార్థి ఫెడరేషన్ దామ ర చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దామర చర్ల మండల కార్యదర్శి వీరన్న నాయక్ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… సమాజంలో సగభాగం అయినటువంటి స్త్రీలపై, విద్యార్థినిలపై వేధింపులు అధికంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు మహిళలను గౌరవించాలని తెలిపారు. దేశంలో మహిళలపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించాలని,
కఠిన శిక్షలు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వీరన్న తో పాటు సాయి, తరుణ్, నవీన్, సర్దార్, అజయ్, ఆనంద్ మండల ఎస్ఎఫ్ఐ నాయకులు, తదితర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





