వివాహితను లైంగికంగా వేధించి కేసుపెడితే చంపుతానని బెదిరించి కత్తి పట్టుకొని తిరిగిన వ్యక్తి అరెస్టు.

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 8 :

నేరస్తుని వివరములు:-

  1. జక్కా రాంబాబు సన్నాఫ్ నర్సింహారావు, వయస్సు 35 సంవత్సరాలు, కులం యాదవ్, వృత్తి వ్యవసాయం, నివాసం కిష్టాపురం గ్రామం, మిర్యాలగూడ మండలం.

కేసు వివరములు:

    మిర్యాలగూడ మండలం కిష్టాపురం  గ్రామంకు చెందిన ఒక మహిళను 7 వ తేదీ  నాడు రాత్రి తన గ్రామంలో తన ఇంటికి వెళ్ళుచుండగా  అదే గ్రామానికి చెందిన జక్కా రాంబాబు అను వ్యక్తి లైంగిక వేధింపులు  చేయుచుండగా, అట్టి వ్యక్తిని మహిళకి సంబందిచిన వారు చూసి పట్టుకోబోగా పారిపోయినాడు.  వారందరూ కలిసి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళుచుండగా  , అట్టి వ్యక్తి పై వారు కేసు పెడతారని భావించి  తన ఇంటిలోని ఇనుప కత్తి తీసుకొని వచ్చి వారందరినీ భయభ్రాంతులకు  గురిచేసినాడు. బాధితురాలు మార్చి 8వ తేదీ బుధవారం రోజున   ఉదయం  పోలీస్ అధికారులకు ఇచ్చిన దరఖాస్తు పై పలు సెక్షన్ల ప్రకారం మరియు ఆర్మ్స్ ఆక్ట్ కేసు నమోదు చేసి మిర్యాలగూడ రూరల్  పోలీస్ అధికారులు దర్యాప్తు చేసి తగు సాక్షాధారాలు   సేకరించి, అట్టి వ్యక్తిని రిమాండ్ కు   తరలించనైనది.        

  ఈ సందర్భంగా యస్.పి కె. అపూర్వరావు   మాట్లాడుతూ.. ఎవరైన ఆకతాయిలు మహిళలను వేధింపులకు  గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,జిల్లాలో షి టీమ్ బృందాలు... అన్ని ప్రాంతాలలో నిఘా పెడుతూ న్నాయాని అన్నారు. ఎవరినైన మహిళలను, విద్యార్థినిలను వేధింపులకు గురి చేస్తే   దైర్యంగా డయల్  100 గాని మీకు దగ్గరలో  సంబంధిత పోలీస్ స్టేషన్ కి గాని తెలియపరచగలరని మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని  ఎస్పీ    కె.అపూర్వరావు  తెలపడం జరిగింది.

నేరస్తుల నుండి స్వాదీన పరచుకున్న వస్తువులు…
నేరస్తుడి నుండి ఒక పొడవైన ఇనుప కత్తి.

ఇట్టి కేసును మిర్యాలగూడ డీఎస్పీ పి. వెంకటగిరి పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకముగా తీసుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ ఎం.సత్యనారాయణ సి.ఐ. ఆఫ్ పోలీస్ మిర్యాలగూడ రూరల్ నేతృత్వంలో మిర్యాలగూడ సబ్ ఇన్స్పెక్టర్ నర్సింహులు, రూరల్ పోలీస్ అధికారుల బృందంతో అట్టి నేరస్తుడిని అతి తక్కువ సమయంలో పట్టుకొని కేసు ఛేదించినందుకు మిర్యాలగూడ రూరల్ పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ కె. అపూర్వరావు అభినందనలు తెలియజేశారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి