తోటి వారిని ఆదుకోవడం మానవ ధర్మం: ఏరియా సేవా అధ్యక్షురాలు దుర్గం సుమతి.

Spread the love

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, మణుగూరు, మార్చ్ 8.

అంతర్జాతీయ మహిళా దినోత్సవo సందర్భంగా బాల వెలుగు పాఠశాల విద్యార్థుల ప్రవేశ పరీక్షలకు ఆర్థిక సహకారంతోపాటు బియ్యాన్ని అందజేసి తమ ఔదార్యాన్ని ఏరియా సేవా సభ్యుల అధ్యక్షురాలు దుర్గం సుమతి రామచందర్ ఆధ్వర్యంలో జరిగింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా టైలరింగ్ ఇతర వృత్తి విద్యలలో శిక్షణ పొందిన మహిళల ఆధ్వర్యంలో సంతోష్ నగర్ బాలవెలుగు పాఠశాల విద్యార్థిని ,విద్యార్థులకు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షల ఫీజుకు 7000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసే కార్యక్రమానికి ఆమె అతిథిగా పాల్గొని మాట్లాడారు.మణుగూరు ఏరియా కి రావడానికి ముందు ఇక్కడి సేవా సభ్యుల సేవా సమితి సభ్యుల సామాజిక సేవా కార్యక్రమాల గురించి విన్నానని నేడు ప్రత్యక్షంగా చూస్తున్నానని ,సేవా మహిళల చొరవతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వారినీ అంతగా ప్రోత్సహించడం నిజంగా అభినందనీయమని ఆమె సేవా మహిళలను వారి కుటుంబ సభ్యులను అభినందించారు. మహిళల ఆర్థికస్వావలంభనకై సింగరేణి అందిస్తున్న ప్రోత్సాహాన్ని వృత్తి విద్యల శిక్షణ కేంద్రాలను ఆసక్తి గల మహిళలు యువతులు సద్వినియోగ పరచుకోవాలని కోరారు. అదేవిధంగా ఏరియా సేవా కార్యదర్శి షేక్ షాకిరా , మాధురి 50 కిలోల బియ్యాన్ని పాఠశాలకు వితరణగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అనంతరం బాల వెలుగు పాఠశాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఏరియాలో సింగరేణి యాజమాన్యం సహకారంతో పలు సామాజిక సేవా కార్యక్రమాలతో చురుకైన పాత్రను పోషిస్తున్న ఏరియా సేవా కార్యదర్శి షేక్ అబ్దుల్ షాకీరా రవూఫ్ ను శాలువా ,పుష్పగుచ్చంతో ముఖ్య అతిథి ,విశిష్ట అతిథులు, బాల బాలికలు సేవా సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆమె సేవలను కొనియాడారు అనంతరం విద్యార్థులకు బిస్కెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు క్లబ్ కార్యదర్శి సామాజిక వేత్త డి అనితా లలిత్ కుమార్, బి కవిత శ్రీనివాసచారి, ఏరియా డి జి యం పర్సనల్ సలగల రమేష్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ షేక్ అబ్దుల్ రవూఫ్, సింగు శ్రీనివాస్, అవినాష్, జాన్ వెస్లీ, సేవా సభ్యులు ఎస్ డి జమీల బేగం, సంధ్యారాణి ,ఆర్ సత్యవతి,స్రవంతి, బి సత్యవతి, కుమారి, శోభ ,ఎం సత్యవతి, లక్ష్మీ ,సిహెచ్ మాధురి, విజయ, ఖతర్ ,టి మాధురి ,సౌజన్య ,కౌసల్య ,కె పద్మ, రేణుక, ఉమాదేవి, రమ, కళ్యాణి, రమాదేవి పాఠశాల నిర్వహకులు బి జగన్మోహన్ రెడ్డి, రామకృష్ణ,దేవి, దుర్గాబాయి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్