ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Spread the love

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (మార్చ్ 08)

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మరియు ఎంవిఆర్ గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలో గల 35 కాలనీలలో నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలైన మహిళా సోదరీమణులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని తారానగర్ లో గల విద్యానికేతన్ హైస్కూల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జంట సర్కిళ్ళ పరిధిలో వివిధ మహిళా సంఘాలకు చెందనటువంటి మహిళా మణులు 75 మందిని శాలువా మరియు బహుమతితో ఘనంగా సత్కరించడం జరిగింది.

ప్రతి కాలనీలో జరిగిన మూడు రకాల పోటీలలో విజేతలైన మహిళా సోదరీమణులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు మొత్తం 210 అందజేయడం జరిగింది. ఈ బహుమతులను ఎంవిఆర్ గ్రూపు చైర్మన్ మూలా వెంకటేష్ గౌడ్ సౌజన్యంతో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి మరియు మూలా వెంకటేష్ గౌడ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆచార్య విజయలక్ష్మి మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండలంలో అనునిత్యం నిర్విరామంగా ప్రజా చైతన్యాన్ని అందించే కార్యక్రమాలతో తీరికలేని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు అశేషంగా విచ్చేసిన మహిళామణులు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వేదిక ప్రతి సంవత్సరం మహిళాభ్యుదయంతో నిండు కుండలా ఉంటుంది. ప్రతి మహిళ తాను చేస్తున్న పనులతో కుటుంబాన్ని, తన చుట్టూ ఉన్న సమాజాన్ని అభివృద్ది పరుస్తూ దేశ ప్రగతిని సాధిస్తుంది. వెలకట్టలేని శ్రమను పంచుతూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడే వారు మహిళలే. ప్రధానంగా స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల, తమ హక్కుల పట్ల, తమ భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మనలోని అశ్రద్ధ, ఉదాసీనత మనల్ని నష్టాల పాలు చేస్తుందనేది గమనించాలి. ఎప్పటికప్పుడు స్త్రీలు అప్రమత్తంగా ఉండాలి. స్త్రీలను కించ పరచటానికి స్త్రీలను వాడుకోవడం, స్త్రీలకు రక్షణ కల్పించటం లోని చట్టాలను సక్రమంగా అమలు చేయక పోవటం, పాలనా రంగంలో స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకపోగా ఉన్న కొంచెం మంది స్త్రీల పాలనా విధానం లోని నిజాయితీకి అడ్డుపడడం వంటివి జరగకుండా అధికారులు, పాలకులు సహకరించాలి. ఈ సంవత్సరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి “డిజిట్ ఆల్ : ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫార్ జెండర్ ఈక్వాలిటీ” అంటే లింగం సమానత్వం కోసం మరిన్ని నూతన సాంకేతిక ఆవిష్కరణలు జరిపి అందరం మానవులు అన్న భావనను సమాజం అందిపుచ్చుకోవాలి అని నినదిస్తుంది. సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న అవాంచిత చర్యలకు ప్రధాన కారణం స్త్రీలు పురుషులు సమానులు కారు అన్న భావన కలిగి ఉండటమే. ఆధునిక ప్రపంచంలో ఎదుగుతున్న స్త్రీల విద్య, ఉద్యోగాలు, వ్యాపార వాణిజ్యాలు, పరిశ్రమల అధినేతృత్వం, పాలనా పాటవం ఇలా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. అంచెలంచెలుగా ఎదుగుతూ క్రమబద్ధ కార్యనిర్వహణ బాధ్యతలు చేపడుతున్న స్త్రీలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, అకారణంగా పదవులనుండి తొలగించటం, వారిపై నీలాపనిందలు మోపడం వంటి పనులు చేస్తూ తమ పబ్బం గడుపు కుంటున్న పురుష పుంగవులు రోజురోజుకీ అధికం అవుతున్నారు. ఎదురు తిరిగితే కడతేర్చ టానికి కూడా వెనుకాడడం లేదు. అందుకే ఐక్య రాజ్య సమితి ఈ థీమ్ ను విడుదల చేసింది. మనమంతా మనుషులం అన్న భావన పెంపొందించేలా మనమందరం కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు వాణి సాంబశివరావు, ఉమా చంద్రశేఖర్, విజయలక్ష్మి , రాణి యాదవ్, రజని, జ్యోతి, సుశీల మరియు ఫ్రెండ్స్ వెల్ఫైర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, పాలం శ్రీను, అమ్మయ్య చౌదరి, దొంతి రాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్