
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 8 :
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.పతాంజలి ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని అవంతిపురం వృద్ధాశ్రమంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధ మహిళలను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జూలకంటి రంగన్న మాట్లాడుతూ..
సమాజంలో సగభాగమైన మహిళల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతుందని దానిని రూపుమాపాలని సూచించారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణించి దేశాభివృద్ధిలో కీలక భాగస్వామ్యం కావాలని కోరారు. మహిళలు సృష్టికి మూలమని అలాంటి మహిళలపై నేటికి అఘాయిత్యాలు జరుగుతున్నాయని వాపోయారు. మహిళా చట్టాలు పకడ్బందీగా అమలు చేయకపోవడంతో మహిళలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. మహిళా లోకం ఏకమై హక్కుల సాధన తో పాటు సమానత్వం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు మోహన్ రెడ్డి, అనంతరెడ్డి, అఖిల్ రెడ్డి, యోగా నిర్వాహకులు లక్ష్మయ్య, రారయ్య, కెవి సూర్య రావు, ఎస్. గోవర్ధన్ రెడ్డి, సిపిఎం నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.





