ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు..

Spread the love

జనసముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 8 :
ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దామరచర్ల సిపిఎం పార్టీ మరియు సిఐటియు ఆధ్వర్యంలో దామరచర్ల మండల కేంద్రంలోని శాంతినికేతన్ హై స్కూల్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యందు మహిళా ఉద్యోగులను మరియు కార్మికులను పూలమాలతో , శాలువా లతో సత్కరించి వారందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ…

ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల సెక్రెటరీ మాలోతు వినోద్ నాయక్ మాట్లాడుతూ..

మహిళలు ఇంటి వరకు మాత్రమే పరిమితంగా ఉండేవారు కానీ నేడు చంద్రమండలం వైపు అడుగులు వేసే స్థాయికి ఎదిగార ని అన్నారు. అంతే కాకుండా ఉన్నత శిఖరాలకు ఎదిగి ప్రపంచంలోనే రాజ్యపరిపాలన చేసే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. దీంతోపాటు దేశంలోని ముఖ్యమైన ఆర్మీ, నేవీ, గాలిలో నడిపే వాహనాలు,తదితర రంగాలలో ఉన్నతమైన పాత్రలు పోషిస్తూ సమాజానికి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ ఈ యొక్క పెట్టుబడిదారీ సమాజంలో ప్రపంచ జనాభాలో సగభాగమైన మహిళలకు వీరికి కావాల్సిన సమాన హక్కు కల్పించడంలో రక్షణ కల్పించడం, రిజర్వేషన్ కల్పించడంలో, ఉద్యోగాలలో ,క్రీడాపరంగా సరైన ప్రాతినిథ్యం ఇవ్వకుండా మహిళల మేధస్సును ముందుకు కొనసాగి యకుండా మళ్లీ పూర్వం వైపు నెట్టేసి ప్రయత్నం చేస్తున్నారు .ఇప్పటికైన పాలకవర్గాలు ఆలోచన చేసి సగభాగంలో ఉండే మహిళలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు .

సిఐటియు మండల కార్యదర్శి బైరం దయానంద్ మాట్లాడుతూ..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భవన నిర్మాణ కార్మిక మహిళా కార్మికులు, వ్యవసాయ మహిళా కార్మికులు,ఆశా ఉద్యోగస్తులకు శాలువాలు కప్పి, పూలదండలు వేసి, స్వీట్లు పంచి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా అనేక రంగాల్లో మహిళా కార్మికులు దూసుకుపోతూన్నరని అన్నారు. 75 వ స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఇంకా మహిళలపై వివక్షత కొనసాగుతూనే ఉందని అన్నారు. దీనికి అంతటికి నాటి పాలకులే కారణం అవుతూ ప్రపంచ కిరాణా పెట్టుబడిదారీ వ్యవస్థను కార్మికులకు తీసుకురావాలని అన్నారు. సమాజంలో మహిళలపై అత్యాచారం జరుగుతూనే ఉన్నాయని వీటిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొని రావాలని అన్నారు. స్త్రీ లేనిదే గమనం లేదని మన శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ ఇంకా చట్టసభల్లో సమానంగా సేలం చూడకపోవడం దురదృష్టకరమని తెలిపి ఇంకా మరెన్నో విషయాలు మాట్లాడి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు బైరం దయానంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు సీనియర్ నాయకులు పాపా నాయక్, సుభాని, మహిళా సంఘం నాయకురాలు కరీమా, మండలంలోని కార్యాలయ మహిళా ఉద్యోగులు, ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది.. లు, మండల నాయకులు, సిపిఎం, సిఐటియు మహిళా నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్