
రైల్వే కోడూరు, జనసముద్రం న్యూస్, మార్చి 8
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రైల్వే కోడూరు పట్టణం వైఎస్సార్సీపీ కార్యాలయం నందు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మహిళలకు చీరలు ,స్వీట్ ప్యాకెట్లు అందించడం జరిగినది. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు వెల్లువలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని,ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వీలైనంత ఎక్కువగా మహిళల పేరిట అందిస్తున్నారన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో, కాంట్రాక్ట్ పనుల్లో సగభాగం కేటాయిస్తున్నారన్నారు. మహిళల రక్షణ కోసం దిశా చట్టాన్ని ఆ రూపొందించి సత్వరమే న్యాయం జరిగేలా దిశ పోలీస్ స్టేషన్ లుఏర్పాటు చేయడం జరిగిందన్నారు.భారతీయ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక విషయాల్లోనూ ఎంతో నేర్పుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇంటి ఆర్థిక విషయాలకే పరిమితం కాకుండా, పొదుపు పెట్టుబడిలాంటి అంశాల్లోనూ ఇప్పుడు చురుకైన పాత్ర పోషిస్తున్నారన్నారు. ఇంకా ఎంతో పురోగతి సాధించాలని, అందుకోసం ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి ధ్వజ రెడ్డి, ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, మండల కన్వీనర్ సుధాకర్ రాజు, మందల నాగేంద్ర, రమణారెడ్డి,వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు శారదమ్మ, రంగమ్మ,సావిత్రమ్మ, పుష్పలత, అరుణమ్మ,నాగమణి, మహిళల భారీ సంఖ్యలో పాల్గొన్నారు.





