రాష్ట్ర పథకాలతో మహిళలకు సముచిత స్థానం: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Spread the love

జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, అశ్వాపురం, మార్చి 8.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,అశ్వాపురం మండలం లోని తుళ్లూరి ఫంక్షన్ హాల్ నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు , జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అనేక విప్లవాత్మక పథకాలు , పాలన విధానాలలో తీసుకున్న సంస్కరణలన్ని మహిళలు అభ్యున్నతికి ఎంతో గానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. మహిళల భద్రత విషయంలో సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలు దేశానికి తలమానికంగా నిలుస్తున్నాయన్నారు, ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్షని, కెసిఆర్ కిట్టు పథకం ద్వారా అమ్మాయి పుడితే 13000 రూపాయలు, అబ్బాయి పుడితే 12000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 13,90,639 మంది లబ్ధి పొందగా ప్రభుత్వం 1261.67 కోట్లు వెచ్చించింది అన్నారు. బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్టు, బిడ్డ పుట్టక ముందే న్యూట్రిషన్ కిట్టు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. డ్వాక్రా గ్రూప్ మహిళలకు మహిళా దినోత్సవం రోజున వడ్డీ లేని రుణాలు 750 కోట్ల రూపాయలు విడుదల చేశారని ఈ సొమ్ముని మహిళల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ,మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు, అశ్వాపురం, మణుగూరు, ఏడుల్ల బయ్యారం పోలీస్ స్టేషన్ల సీఐ,ఎస్ఐలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి