
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 8 :
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల ప్రజా పరిషత్ అధ్యక్షు రాలు నూకల సరళ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నూకల సరళ హనుమంతు రెడ్డికి, ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మికి వివిధ శాఖల మహిళా ఉద్యోగులందరూ కలిసి శాలువాను కప్పి పుష్పగుచ్చం అందజేసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ,ఎంపిడిఒ , కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది కలిసి మహిళా…ఎంపీటీసీ లను, సర్పంచ్ లను, మిర్యాలగూడ మండలంలో పనిచేసే శాఖలలో ని కార్యాలయ మహిళా ఉద్యోగులు..రెవెన్యూ, హెల్త్డిపార్ట్మెంట్, పంచాయతీ రాజ్ శాఖ, ఐకెపి, విద్యాశాఖ, తదితర కార్యాలయాల్లో పనిచేసే మహిళ ఉద్యోగులకు ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఈ కార్యక్రమం కు అతిథులుగా వచ్చిన నాయకులు.. కలిసి వీరికి శాలువాలు కప్పి సన్మానించడం జరిగింది. అనంతరం స్వయం సహాయక చెక్కును… ఈ కార్యక్రమానికి అతిథులుగా జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , ఎంపీపీ, ఎంపీడీవో వివిధ కార్యాలయ అధికారులు అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో జి. జ్యోతిలక్ష్మి, కరుణాకర్ రావు , ఎంపీఓ టి.వీరారెడ్డి, ఏఈ, కార్యాలయ తదితర ఉద్యోగులు,సిబ్బంది, అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.






