మహిళా దినోత్సవం రోజున తప్పని అవమానం.

Spread the love

*మార్చ్ 8న విధులకు హాజరవ్వాలని ఆదేశాలు.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, మణుగూరు ,మార్చి 8.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 8 వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శాఖలకు స్పెషల్ కాజువల్ లీవ్ మంజూరు చేసింది. ఇది ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన గౌరవం. కానీ ఇప్పపటికి ఈరోజు లీవ్ తీసుకోవడానికి మహిళా ఉద్యోగులు ఒకరోజు ముందుగా పర్మిషన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు కొంతమంది జిల్లా అధికారులు. అదిమాత్రమే కాకుండా ఉద్యోగులు ఉన్న వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్ కూడా పెట్టి మహిళా ఉద్యోగులను అవమానిస్తున్నారు. ఫోన్ చేసి మరీ నా పర్మిషన్ ఎందుకు తీసుకోలేదని బెదిరిస్తూ మహిళా ఉద్యోగులను వేదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై గౌరవంతో ప్రకటించిన సెలవును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో కొంతమంది ఉన్నతాధికారులు నిరర్థకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళా ఉద్యోగులపై తమ ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి పూనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే పాల్వంచ భవిత కేంద్రంలో ఐఈఆర్పి గా విధులు నిర్వహిస్తున్న కనకదుర్గ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాల్వంచ వర్తక సంఘం భవనంలో ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్- తెలంగాణ రాష్ట్రం, పాల్వంచ మండల శాఖ ఆధ్వర్యంలో మండల మహిళా విభాగం వారు నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు సిద్దమవుతుంది. ఇదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐఈ కో ఆర్డినేటర్ సైదులు ఫోన్ చేసి భవిత కేంద్రంలో విధులకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకలకు హాజరగుతున్నాని ఈరోజు రాష్టం ప్రభుత్వ సెలవు ప్రకటించింది అని వివరించినా పట్టించుకోకుండా ఒకరోజు ముందుగా నావద్ద అనుమతి ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తాళం వేసున్న పాల్వంచ భవిత కేంద్రం ఫోటోలు తీసి ఐఈఆర్పీ లు ఉన్న గ్రూపులో పోస్ట్ చేసి భవిత కేంద్రం ఎందుకు మూసేసి ఉంచారు అంటూ మెసేజ్ పెట్టాడు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రపంచమే మహిళలను గౌరవిస్తుంది. దీనికి సూచనగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ-ప్రైవేటు సెక్టార్లలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ స్పెషల్ కాజువల్ లీవ్ ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా మహిళా ఉద్యోగులను అవమానిచెలా మాట్లాడటంతో ఖంగుతిన్న సదరు మహిళా ఉద్యోగి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తెలంగాణ సియస్, స్టేట్ కో ఆర్డినేటర్, మహిళా కమిషన్ లకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి