మహిళా శక్తి అణిచివేత ధోరణికి ముగింపు పలకాలి: సర్పంచ్ శ్రీవాణి.

Spread the love

*మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు పంపిణీ చేసిన పోలెబోయిన శ్రీవాణి.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, కరకగూడెం, మార్చ్ 8.

కరకగుడెం మండలం, సమత్ భట్టుపల్లి గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి ఘనంగా మహిళా దినత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏ పి ఓ త్రిగుణ మాట్లాడుతూ మహిళలకు నేటి సమాజంలో స్వేచ లేదని,మహిళల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్న వాటిని అమలు చేయక,మహిళలకోసం పోరాడే వాళ్ళు లేనందువలన మనకోసం మనమే గళం వినిపించాలని, ప్రస్తుతం కాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను తీవ్రంగా ఖండిస్తూ అందరికి మహిళా దినత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
సమత్ భట్టుపల్లి సర్పంచ్ శ్రీవాణి మాట్లాడుతూ నేటి సమాజంలో ఎంత అభివృద్ధి చెందుతున్నామో అంత ఎక్కువగా మహిళలను అణచివేస్తున్నారని,మహిళలపై జరుగుతున్న సంఘటనలు ఖండిస్తూ తోటి ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తదనంతరం కార్యక్రమానికి హాజరైన వారందరూ కలిసి కేక్ కట్ చేసి, ఆడపడుచులందరికీ స్వీట్లు,చీరల పంపిణీ, ఆట పాటల కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలందరితో కనుల పండుగ వాతావరణo నెలకొంది.ఈ కార్యక్రమంలో ఏపీవో త్రిగుణ,పోలెబోయిన లక్ష్మి నరసమ్మ
స్థానిక మహిళా సంఘాలు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు, కరకగూడెం మండల పరిధిలోని పలు గ్రామాల నుండి విచ్చేసిన మహిళలు, పాత్రికేయులు,స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి