
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 8 :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ..
40 లక్షల మంది మహిళలకు ఆసరా పెన్షన్ లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల పట్ల పక్షపాతని అన్నారు.
బాలికల చదువులు కోసం గురుకుల పాఠశాలలు ,కాలేజీ లను ఏర్పాటు చేశారని తెలిపారు.
మహిళ దినోత్సవం సందర్భంగా పలు పీహెచ్సీ కేంద్రాల్లో మహిళల కోసం క్లినిక్ లను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.రాష్ట్రంలో రాజకీయ పదవుల్లో మహిళల కు రిజర్వేషన్లు అందించిన ఘనత, తెలంగాణ లో మహిళల రక్షణ కోసం సీఎం కేసీఆర్ అద్భుతమైన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ లో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నారని ఇంకా మరెన్నో విషయాలు విలేఖరుల సమావేశంలో మాట్లాడి తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి “మహిళలందరికీ” అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.





