
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,పినపాక, మార్చి 8.
పినపాక మండల వ్యాప్తంగా హోలీ ఉత్సవాలు యువకులు,పెద్దలు, స్త్రీలు,చిన్నారులు ఘనంగా నిర్వహించారు.పినపాక గ్రామంలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. రంగుల పండుగ కేరింతలు, ఆనందోత్సవాల మధ్య మంగళవారం గ్రామ ప్రజలు హోలీ పండుగను జరుపుకొన్నారు.పినపాక గ్రామంలో ఏ వీధిలో చూసినా హోలీ వేడుకలు కనువిందు చేశాయి. చిన్నారులు, యవతీ యువకులు, పెద్దలు రంగుల్లో మునిగి తేలారు. పలుచోట్ల హోలీ సందర్భంగా కామదహనం నిర్వహించారు. చిన్నా పెద్దా కలిసి ఆడిపాడుతూ రంగులు పూసుకుంటూ సందడి చేశారు.సాంప్రదాయ బద్ధంగా యువకులు సహజ సిద్ధమైన రంగులు పూసుకుంటూ హోలీ పండుగ జరుపుకున్నారు.పినపాక గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు,ఎంపీటీసీ చింతపంంటి సత్యం యువతలో ఉత్సాహం నింపి వారితో పాటు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.రంగుల వలే జీవితాలు కూడా రంగుల మయంగా మారాలని వారు కోరుకున్నారు.హోలీ సందర్భంగా మండలంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై నాగుల్ మీరాఖాన్ ఆధ్వర్యంలో గోదావరి పరిసర ప్రాంతాల్లో, గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు.





