మార్చి 8 న జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐదో తరగతి వరకు చిత్రలేఖనం, పదవ తరగతి వరకు వ్యాసరచన పోటీలు : హమీద్ షేక్..

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 7 :

మార్చి 7న హోలీ పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్, ప్రముఖ న్యాయవాది,సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ తెలిపారు. అంతేకాకుండా మార్చి 8న జరగబోతున్న
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ “మహిళా దినోత్సవ” శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్టు హమీద్ షేక్ అన్నారు. పాఠశాలలలో..1 నుంచి 5వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు , 6 నుంచి10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని ప్రకటించారు. మహిళా దినోత్సవాన్ని ప్రతిబింబించే చిత్రాలను ఏ4 డ్రాయింగ్ షీట్ పై 1నుంచి 5 తరగతులు చదువుతున్న విద్యార్థులు పెయింటింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.”మహిళ” సాధికారతలో భాగంగా సామాజిక, రాజకీయ, సేవా రంగాల్లో మహిళలు నిర్వర్తించాల్సిన పాత్ర “ద రోల్ ఆఫ్ ఉమెన్ టు బీ డన్ ఇన్ సోషల్, పొలిటికల్, సర్వీస్ కేటగిరీస్ టు అచీవ్ ఉమెన్ ఎంపవర్మెంట్ “అంశంపై ఐదు ఏ-4 సైజ్ పేపర్ లకు మించకుండా ఇంటి వద్ద నుంచి లేదా ఉపాధ్యాయుల సమక్షంలో మంచి వ్యాసం రాసి తమకు పంపాలని కోరారు. ఇందులో ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని పాఠశాలల్లో చదువుతున్న తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు. వ్యాసాలు రాసిన అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్, సంబంధిత తరగతి ఉపాధ్యాయులు..ధ్రువీకరణ చేయించుకున్న వ్యాసాలను న్యూ మున్సిపల్ కాంప్లెక్స్ లోని సనా మొబైల్స్, షాపు నెంబర్ 52 లో నేరుగా మార్చి 7వ తేదీ సాయంత్రం 8 గంటల లోపు అందజేయాలని కోరారు. వ్యాసం రాసిన పేపర్ పై భాగంపై పేరు, తండ్రి పేరు, తరగతి, ఫోన్ నెంబర్, స్కూల్ పేరు, పాఠశాల నెంబర్ కచ్చితంగా రాయాలని కోరారు. ఉత్తమ వ్యాసాలు అందించిన విద్యార్థులకు, మంచి పెయింటింగ్స్ చేసిన విద్యార్థులకు” అంతర్జాతీయ మహిళా దినోత్సవం “రోజున జ్ఞాపికలు, మెడల్స్ అందజేయనున్నట్టు హమీద్ షేక్ తెలిపారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి