
లక్కీ కూపన్ తీసిన మౌలాలి కార్పొరేటర్ సునీత యాదవ్….
స్మార్ట్ బ్యాటరీ వాహనాన్ని గెలుపొందిన శాలిని……
చిన్నారులకు పెద్దలకు ఆహ్లాదాన్ని అందించే వాతావరణాన్ని ఏ ఏం ఆర్ ప్లానెట్ మాల్ లో ఏర్పాటు : ఎండి శాగంటి అనంత్ కుమార్
మల్కాజిగిరి,మౌలాలి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్:
మార్చ్ 07
మంగళవారం
చిన్నారులకు క్రీడా ప్రాంగణం, పెద్దలకు మానసిక ప్రశాంతత తో పాటు వినుల విందైన ఆహ్లాదాన్ని అందించేందుకు సికింద్రాబాద్ మౌలాలి ప్రాంతంలో ఏ ఏం ఆర్ ప్లానెట్ మాల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని మాల్ మేనేజింగ్ డైరెక్టర్ శాగంటి అనంత్ కుమార్ పేర్కొన్నారు. సమ్మర్ స్పెషల్ గా ఏం అర్ మాల్లో షాపింగ్ చేసి కూపన్ అందించిన కస్టమర్లకు బహుమతులను అందించేందుకు ఏ ఎం ఆర్ ప్లానెట్ మాల్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మౌలాలి కార్పొరేటర్ సునీత యాదవ్ విచ్చేసి లక్కీ డ్రాను తీశారు. ఈ సందర్భంగా శాలిని అనే మహిళకు స్మార్ట్ బ్యాటరీ బైక్ రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సునీత యాదవ్ మాట్లాడుతూ
సికింద్రాబాద్ ,నాగారం, ఏఎస్ రావు నగర్, కీసర ,దమ్మయిగుడ, జవహర్ నగర్ ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఏఎన్ఆర్ ప్లానెట్ మాల్ కొత్త అనుభూతిని ఇస్తుందని కొనియాడారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో ఏడు మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. చిన్నారులు ఆడుకునేందుకు వివిధ రకాల గేమ్ పాయింట్లు , చిన్నలు పెద్దలు కలిసి వినూత్నంగా మాల్ లో ఏర్పాటుచేసిన ట్రైన్ హోటల్ లో శుచి శుభ్రత కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ షాగంటి ఆనంత్ కుమార్ మాట్లాడుతూ అన్ని తరగతుల ప్రజలకు ధరలు అందుబాటులో ఉండే విధంగా ఎ ఏమ్మార్ ప్లానెట్ లో వివిధ షాపింగ్ మాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం లక్కీ డ్రా లో గెలుపొందిన శాలికి మంగళవారం యాజమాన్యం చేతుల మీదుగా స్మార్ట్ బైక్ ను అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శేఖర్ యాదవ్ మీడియా కన్వీనర్ తాజ్ ఖాన్, మీడియా ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు





