
- కొల్చారం తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించిన జర్నలిస్టులు…
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) మార్చి :6
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో పనిచేస్తున్న వివిధ దినపత్రికలకు చెందిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సోమవారం కొల్చారం తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. నిజాలు నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయిస్తున్న ఇళ్ల స్థలాలను కొల్చారం మండల విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత కొన్ని రోజుల క్రితం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించామని కొల్చారం మండలం విలేకరులు తెలిపారు.





