
- బిజెపి నాయకుడు మురళి యాదవ్…. మెదక్ జిల్లా, ప్రతినిధి (జనసముద్రం న్యూస్) మార్చ్: 6
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఉన్న వివిధ గ్రామాలను అభివృద్ధి పథంలో నడపాలని బిజెపి నాయకుడు మురళి యాదవ్ అన్నారు. సోమవారం పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొల్చారం మండలంలో ఒక్క గ్రామానికి కూడా దళిత బంధు పథకం , డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేవని ఆయన గుర్తు చేశారు. వెంటనే స్థానిక నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చొరవ తీసుకొని అర్హులైన నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ , దళిత బంద్ పథకాలను మంజూరు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండలం బిజెపి అధ్యక్షుడు పాతవి దయాకర్ గౌడ్ , మండల ఉపాధ్యక్షులు జంగం గారి శ్రీకాంత్ గౌడ్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు పల్లె రవికాంత్, చిన్న ఘనపూర్ బూత్ అధ్యక్షులు జోగిపేట బాబా గౌడ్ , రాంపూర్ బూత్ అధ్యక్షులు యాదగిరి, హంసన్ పల్లి బూత్ అధ్యక్షులు రవీందర్ గౌడ్, యాదగిరి, రఘువీర్ , మల్ల గౌడ్ , బైకరి మల్లేశం బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.





