సోషలిస్టు ప్రదాత కామ్రేడ్ స్టాలిన్

Spread the love

యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి(మార్చ్ 05)

మార్క్సిస్టు మహోపాధ్యాయులు కామ్రేడ్ స్టాలిన్ 70వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం నాడు స్టాలిన్ నగర్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్ స్టాలిన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం అయన మాట్లాడుతూ పేద ధనిక వర్గము వర్ణము కులము లాంటి అంతరాలు లేని సమాజ నిర్మాణం సోషలిజాన్ని స్థాపించిన మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కామ్రేడ్ స్టాలిన్ అని అన్నారు సామ్రాజ్యవాదానికి సామ్రాజ్యవాదానికి పెట్టుబడి దారి ఆర్థిక విధానానికి ఆనాడు రష్యాలో కామ్రేడ్ లెనిన్ తో కలిసి సోషలిస్టు వ్యవస్థ స్థాపన కోసం పోరాడినారని ఫలితంగా లెనిన్ నాయకత్వన స్థాపించబడిన సోవిటి యూనియన్ ను ప్రపంచంలోని ఆధిపత్య ఫాసిస్టు నియంతృత్వ శక్తులను ఎదిరించి కమ్యూనిస్టు పార్టీ నేతృతంలో సోషలిజాన్ని నిలబెట్టారని అన్నారు. మరో పక్క జర్మనీ నియంత హిట్లర్ నియంతృత్వాన్ని తిప్పిగొడుతూ రెండవ ప్రపంచ యుద్ధాన్ని రష్యా సేనాలతో నిలబెట్టి యుద్ధాలు వద్దు ప్రపంచశాంతి ముద్దని ప్రపంచానికి సాటి చెప్పారని కొనియాడారు. కామ్రేడ్ స్టాలిన్ భారతదేశంలో సోషలిజం సాధన కోసం 1951 లో భారత విప్లవ సారధులకు విధివిధాలను ఇస్తూ భారతదేశంలో సోషలిస్టు సాధనకు చేసిన సూచనలను నేటికీ యంసిపిఐ(యు) కట్టుబడి పని చేస్తుందని సోషలిస్టు ప్రదాత స్టాలిన్ సూచన దిశగా ఈ భారత దేశంలో వర్గ,సామాజిక పోరాట జలీమితో భారతదేశంలో సోషలిజం సాధించబడుతుందని అన్నారు. భారత పాలకవర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాల నిర్వహిస్తూ పెట్టుబడిదారి ఆర్థిక విధానాలకు,అవినీతికి, కుల-మతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని ఎంసిపిఐ(యు) పోరాటంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరిగి సోషలిస్టు స్థాపన దిశగా స్టాలిన్ ఆశయాలతో ముందుకు
సాగాలని ఆయన పిలుపునిచ్చారు ఎన్ గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి భాగ్యమ్మ, మియాపూర్ డివిజన్ కమిటీ సభ్యులు ఎం.రాణి, దార లక్ష్మి,స్టాలిన్ నగర్ సభ్యులు వనం రాధ,ఈశ్వరమ్మ,కే మాధవ, ఎన్ నాగభూషణం,ఏ.శంకర్,డి. శ్రీనివాసులు,టి.నర్సింగ్, కే.షరీష్, సి.హెచ్.శీను, చంద్రమోహన్ రెడ్డి,రామయ్య, డి.నగేష్,రాములు తదితరులు పాల్గొని స్టాలిన్ కు ఘనంగా నివాళులర్పించారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి