
జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (మార్చ్ 05)
ముదిరాజ్ కులస్తులందరూ ఏకతాటిపైకి రావాలని శేరిలింగంపల్లి కన్వీనర్ అశోక్ ముదిరాజ్ అన్నారు.ఆదివారం రోజు మియాపూర్ డివిజన్ ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకుల సమావేశం కార్పోరేటర్ అభ్యర్థి బండారి మోహన్ ముదిరాజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముదిరాజ్ సంఘం డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వేణుగోపాల్ ముదిరాజ్, సతీష్ ముదిరాజులు హాజరయ్యారు మియాపూర్ డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో డివిజన్ కమిటీ సభ్యులు, అన్ని కాలనీల, బస్తీల నుండి ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజకీయంగా, ఆర్థికంగా బలపడాలంటే క్షేత్రస్థాయిలో ముదిరాజ్ కులస్తులందరు ఏకతాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సంఘటితంగా ఉన్నప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయని, అందుకు ఏ ఒక్కరు అతీతం కాకుండా, ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా భావించి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ముదిరాజ్ కులస్తులలో ఏ ఒక్కరికి ఏ ఆపద వచ్చినా అందరం కలిసికట్టుగా ఉంటూ అండగా ఉండాలని, ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని అభివృద్ధి ఫలాలను అందుకొని ఆర్థికంగా బలపడాలని తీర్మానించారు. ముదిరాజ్ కులస్తులు అంటే ఏ కులానికో మతానికో వ్యతిరేకం కాదని, కేవలం తమ సంఘం అభివృద్ధి కోసమే ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్దామని కోరారు. రానున్న రోజుల్లో శేరిలింగంపల్లి అన్ని డివిజన్ లలో బస్తీ కమిటీలను, యూత్ కమిటీలను, మత్స్యశాఖ కమిటీలను, మహిళా కమిటీలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని, అందుకు యువత ముందుకు రావాలని, తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండె దయానంద్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, మాజీ అధ్యక్షులు ప్రభాకర్ ముదిరాజ్, ప్రసాద్ ముదిరాజ్, నరేందర్ ముదిరాజ్, సంతోష్ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు





