
జనసముద్రం న్యూస్,మంగళగిరి,మార్చ్ 5:
టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాస్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ను శనివారం మంగళగిరి లో టిడిపి సెంట్రల్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థుల్ని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు అనంతరం ఇరువురు అనంతపురంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గురించి చర్చించారు.





