
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 4 :
మిర్యాలగూడ పట్టణంలోని మార్చి 1, 2 తేదీలలో జరిగిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలలో మాలోతు వినోద్ నాయక్ ను రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఏకిగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా మాలోతు వినోద్ నాయక్ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులు పడుతున్న ఇబ్బందులను సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రాధాన్యత వహిస్తానని అన్నారు. అదేవిధంగా ఈ మహాసభల సందర్భంగా గిరిజనులకు సంబంధించిన అనేక తీర్మానాలు ఆమోదించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా 12 శాతం రిజర్వేషన్, బ్యాంకులకు సంబంధం లేకుండా ట్రై కాన్ లోన్లు ఇవ్వాలని, గిరిజన అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని, గిరిజన రిజర్వేషన్లను రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం ఇలా అనేక తీర్మాణంలో ఆమోదించడం జరిగింది. పై తీర్మానాలన్నీ అమలయ్యేంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సమరసిల పోరాటానికి సిద్ధమని మాలోతు వినోద్ నాయక్ అన్నారు .ఈ ఎన్నికకు సహకరించిన పలు సంఘాల నాయకులు, సిపిఎం సిఐటియు నాయకులు, డివైఎఫ్ఐ నాయకులు , కార్యకర్తలు, తదితరులకు “విప్లవాది వందనాలు” మాలోతు వినోద్ నాయక్ తెలియజేయడం జరిగింది.





