విద్యుత్ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతాయి:బి టి పి ఎస్ జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి.

Spread the love

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు, మార్చి 2.

పిఆర్సి అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న దశల వారి ఆందోళనలు కొనసాగుతాయని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ బి టి పి ఎస్ రీజియన్ కన్వీనర్ ఎస్.శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.విద్యుత్ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించాలని చేస్తున్న దశల వారి ఆందోళనలో భాగంగా బీటీపీఎస్ లోనే అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పిఆర్సి ప్రకటించాలని ప్లక్కార్డ్స్ ధరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల ఆందోళనల వల్లే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హైదరాబాద్ లో బుధవారం జెఏసి నాయకులతో చర్చలు జరిపారని, రానున్న రెండు మూడు రోజుల్లో పిఆర్సి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ మంత్రి జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీని వివరించారు. ఒకపక్క ప్రభుత్వం, యాజమాన్యాలతో చర్చిస్తూనే మరోపక్క ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా శుక్ర,శనివారాల్లో కూడా ధర్నాలు ఉంటాయని, ఆందోళనలను మరింత విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వి. ప్రసాద్, రవి ప్రసాద్,బి.సత్యనారాయణ, కె.ప్రేమ్ కుమార్, వీరస్వామి, అసోసియేషన్ నాయకులు రాజబాబు, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్