అంగన్వాడీల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా,
ఆర్డీవో కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా..

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 2

అంగన్వాడీల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా నని ఈ విషయంపై ఈరోజే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకటి రంగారెడ్డి అన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన మార్చి 1, 2, 3 రోజుల సమ్మెలో భాగంగా రెండవ రోజు గురువారం అంగన్వాడీలు ఆర్డీఒ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డిఓ చెన్నయ్య కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ..

అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని, అంగన్వాడీలపై రాజకీయ ఒత్తిడి లను తగ్గించాలని కోరారు. అంగన్వాడి కేంద్రాలకే ఫుడ్ సరఫరా చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు గ్రా డ్యూటీ చెల్లించాలన్నారు వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలన్నారు.టీచర్లతో సమానంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఖాళీ
పోస్టులు వెంటనే భర్తీ చేసి ఈ సమస్య పరిష్కార కోసం తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.అంగన్ వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలన్నారు. ఎండకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలన్నారు. జివో నెం 14, 19, 8 లను వెంటనే సవరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, ఆయూబ్, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు..పార్వతి ప్రమీల, తుడి అరుణ, స్వరాజ్యం బెజ్జం నాగమణి, స్వరాజ్యం, జి. రజిత, ఝాన్సీ, రాధాబాయి, విజయ, శేషు మని, గౌసియా, చంద్రకళ, మండే వనజ, నాగమణి, శ్రీదేవి, ఉమా, తదితర అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొని ఆర్డీవో కు” వినతి పత్రం” అందజేశారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి