పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు:

ఆచ కొండ కమీషనర్ డి. ఎస్ చౌహాన్ ఐపిఎస్
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 02:తుపాకుల రమేష్
గురువారం త్వరలో ప్రారంభం కానున్న ఐ.పి. ఎల్ – 2023 క్రికెట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సన్ రైజర్స్ యాజమాన్యంతో రాచకొండ కమిషనర్ డి ఎస్ చౌహాన్ ఐ.పి.ఎస్ సమీక్షా సమావేశం నెరెడ్ మెట్ లోని కమీషనర్ ఆఫీస్ లో నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరుగనున్న మ్యాచ్ ల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టికెట్ల పంపిణీ లో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని నిర్వహణ బృందానికి సూచించారు. ఈ కార్యక్రమంలో సన్‌రైజర్స్ సి. ఈ. ఓ ,షణ్ముగం ,తో పాటు డి.సి.పి మల్కాజ్ గిరి జానకి ఐ.పి.ఎస్, ఏ.సి.పి నరేష్ రెడ్డి, ఉప్పల్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.






