
ఏ.బీ.వీ.పీ నాయకులు ఇలాంటి చర్యని పునరావృతం కాకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 02: తుపాకుల రమేష్
మల్కాజ్గిరి ఏ. బి.వి.పి
శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న సాత్విక్ కుటుంబానికి మరియు గత వారం రోజులుగా వరుసగా ఆత్మ హత్యలు చేసుకున్న విద్యార్థి కుటుంబలకు న్యాయం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ చైతన్య, నారాయణ కళాశాలల పై చర్యలు తీసుకోవాలని అని డిమాండ్ చేస్తూ
ప్రభుత్వ చేతకాని తనం నిరసిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ( ఏ. బి.వి.పి) ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చెయ్యడం జరిగింది. అయితే పోలీసులు ఏబీవీపీ నాయకులను పోలీస్ స్టేషన్ లో బంధించడం జరిగింది. విషయం తెలుసుకున్న బి.జె.పి మల్కాజ్గిరి అసెంబ్లీ కన్వీనర్ పంజాల సదానంద్, మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బిజెపి అధికార ప్రతినిధి ఉడుత నవీన్ , పోలీస్ స్టేషన్ కి వెళ్లి వారిని విడిపించడం జరిగింది .

ఈ కార్యక్రమంలో ఉప్పల్ జిల్లా కన్వీనర్ అఖిల్ సింగ్, మల్కాజిగిరి కార్యదర్శి కత్రాజ్ రాకేష్, సంయుక్త కార్యదర్శి నవీన్& సుమన్, వైస్ ప్రెసిడెంట్ సంతోష్,వికాస్, చందన్, అశోక్, పవన్, శివ సాయి నాథ్, చిన్ను, నితిన్, ఆదిత్య, సందీప్,అభినవ్, కుమార్, శుశాంక్ గౌడ్, సంతోష్, ఆదర్శ్, కిషోర్, మనోజ్, పాల్గొన్నారు.





