
జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్ ,కరకగూడెం, మార్చి 2.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, చిర్రమళ్ళ గ్రామంలో నియోజకవర్గ నాయకులు చందా మధు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ కోఆర్డినేటర్ తాతా మాధవి లత హాజరై సమ్మక్క సారక్క గద్దల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇంటింటికి బొట్టుపెట్టి తెలుగుదేశం పార్టీ పూర్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పుడు ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించడం జరిగింది.ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఉదృతం చేసి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే చర్యలు తీసుకునే విధంగా నాయకులు, కార్యకర్తలు నడుచుకోవాలని యువతకు అధిక ప్రాధాన్యత కల్పించి రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేసే విధంగా దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కార్యకర్తలను కోరడం జరిగినది.ఈ కార్యక్రమంలో చందా రాఘవులు, వెంకటనారాయణ, ధర్మరాజుల శంకర్, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.





