రాచకొండ కమిషనర్ డియస్ చౌహాన్ చేతుల మీదుగా భద్రత ఎక్స్ గ్రేషియా

Spread the love

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 02:తుపాకుల రమేష్

గురువారం చనిపోయిన పోలీసు కుటుంబాలకు తొందరగా పెన్షన్ మరియు ఉద్యోగం వచ్చే విధంగా చూడాలని రాచకొండ సీపీ ఆదేశించారు. రాచకొండ కమినరేట్ పరిధిలో పనిచేస్తూ చనిపోయిన పోలీసు కుటుంబ సభ్యులకు ఈరోజు సిపి రాచకొండ చౌహాన్ భద్రత, ఎక్స్ గ్రేషియా చెక్కులను సీ.పీ ఆఫీస్ లో స్వయంగా అందజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారిని ఆప్యాయంగా పలకరించి నేనున్నానని భరోసాని రాచకొండ సీ.పీ చౌహాన్ కల్పించారు.

పోచంపల్లి పోలీస్ స్టేషన్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ మరణించిన జాన్సన్ భార్య సునీత కు భద్రత నుండి 7,99,160 రూపాయలు, విడో ఫండ్ 10,000/-, ఫ్లాగ్ ఫండ్ 10,000/-, కార్పస్ ఫండ్ 50,000/- చెక్కులను
మల్కాజిగిరి పొలిస్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ మరణించిన నరేష్ కుమార్ బార్య లక్ష్మిబాయి కి భద్రత నుండి 3,93,700/-, కూతురు పేరు పై 1,96,850/-, కొడుకు పేరుపై 1,96,850/- రూపాయల చెక్కులను, రాచకొండ సీ.పీ చౌహాన్ చేతుల మీదుగా వారి కుటుంబాలకు అందజేశారు.
ఈ సందర్భంగా సిపి డి.ఎస్ చౌహన్ ఐ.పి.ఎస్ మాట్లాడుతూ.. చనిపోయిన రెండు కుటుంబాలకు తొందరగా పెన్షన్ మరియు ఉద్యోగం వచ్చే విధంగా చూడాలని రాచకొండ అడ్మిన్ అడిషనల్ డి.సి.పి నర్మద, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రా రెడ్డి మరియు మినిస్టిరియల్ సిబ్బందిని సీ.పీ ఆదేశించారు.

సిబ్బంది సంక్షేమమే ముఖ్యం : సీపీడి.ఎస్ చౌహన్

సిబ్బంది సంక్షేమమే ముఖ్యమని రాచకొండ సీ.పీ అన్నారు.
9 నెలలుగా పెండింగ్లో ఉన్న టీ ఏ బిల్లు ఎమౌంట్ ను సి.పి సకాలంలో మంజూరీ చేసినందుకు రాచకొండ పోలీస్ సిబ్బంది సంతోషంగా ఉన్నారని, సీ.పీ విశేష కృషి వల్ల పెండింగ్ లో ఉన్న టీ ఏ సకాలంలో వచ్చినందుకు పోలీస్ అధికారుల సంఘం కృతఘ్నతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమములో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి. నర్మద, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు భద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్