
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజె, మార్చి 1:
మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోఅంజలీదేవి మరియు సైదులు అనే ఇద్దరి సెల్ ఫోన్లు పోయినాయని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వగా ,మేము వారి సెల్ ఫోన్ లను కనిపెట్టి మార్చి ఒకటో తేదీన ఈ రోజున వీరికి ఇవ్వడం జరిగినదని వన్ టౌన్ సిఐ రాఘవేంద్రరావు, ఎస్సై సుధీర్ కుమార్ తెలిపారు.
ఈ సెల్ ఫోన్ లు కనిపెట్టడానికి తమ వంతు కృషి చేసిన వన్ టౌన్ పోలీస్ సిబ్బంది ని సీఐ రాఘవేంద్రరావు అభినందనలు తెలపడం జరిగింది.






