విద్యార్థుల మృతులకు కారణమవుతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసిన బీసీ సంక్షేమ సంఘం..

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 1:

మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రయోజకుడు అవుతాడని భావించిన తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చిన శ్రీ చైతన్య విద్యాసంస్థలను రద్దు చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో పిర్యాదు చేసినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు.

ఈ సందర్భంగా జాజుల లింగం గౌడ్ మాట్లాడుతూ..

కళాశాల యాజమాన్య వేధింపులు ఒత్తిడి తట్టుకోలేక ఏమీ తెలియని విద్యార్థి జీవితం బలయిందని,పది రోజుల క్రితమే ఉప్పల్ ఫిర్జాదిగూడ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల లో అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, ఆమె ఆత్మహత్య ఘటన మరవకముందే హైదరాబాద్ లోని నార్సింగ్ ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నాగుల సాత్విక్ అనే ఇంటర్ మీడియట్ చదివే విద్యార్థి తన క్లాస్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థి సాత్విక్ ను అధికంగా ఒత్తిడికి గురిచేయడం, తిట్టడం, కొట్టడం వల్లే తాను మనస్థాపాన్ని గురై ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.యాజమాన్య వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని, కళాశాల యాజమాన్యంపై క్రిమినల్,హత్య కేసు నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పూసల సతీష్,హరి,నర్సింగ్ రావు పాల్గొని మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్