
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 01
ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమం
చివరి రోజు వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని వినోభా నగర్ లో శక్తి కేంద్ర ఇంఛార్జి వి.సర్వేశ్ యాదవ్ గారి అధ్యక్షతన బూత్ నెంబర్ లు 217,218,219 స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాలలింగం, మాజీ కౌన్సిలర్ నరసింహ గౌడ్, ఆనంద్ గౌలికర్ గార్లతో కలసి పాల్గొన్న బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్
ఈ సందర్భంగా జిల్లెల రవి యాదవ్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 వేల శక్తి కేంద్రాలలో ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నామని కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిజేస్తున్నామన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు, మన తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రత్యక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసామని. 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారాని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తా అని, తను తెలంగాణకు కాపలా కుక్కలా వుంటా అని చెపిన కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు, తానే రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడని, కెసిఆర్ చెప్పిన నీళ్ళు, నిధులు, నియామకాలు నీళ్ళు ఏమో మద్యంమై ఏరులై పారుతుందాని, నిధులు ప్రతి ఎన్నికలో ఉప ఎన్నికలో ఏదో నోటికోచిన పదాలతో కొత్త పధకం ప్రకటించి అ పధకాని సంపూర్ణంగా అమలు పరచకుండా, అ పధకం పేరుతో కోట్లు అవినీతి చేసి కల్వకుంట్ల కుటుంబం ఎంజాయ్ చేస్తుందాని. చివరిగా నియామకాలు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం, లక్ష ఉద్యోగం అని మాటలు చెప్పిన కెసిఆర్ ఎవరికీ ఉద్యోగాలు ఇవలేదని తన కుటుంబంలో మాత్రం కొడుకు, అల్లుడుకు, బిడ్డకి, సడకుడి కోడుకి ఉద్యోగాలు ఇప్పించుకున్నాడని తెలిపారు. ఇక తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పే కెసిఆర్ వారి గారాల బిడ్డ కల్వకుంట్ల కవిత ప్రపంచం మొత్తం తెలిసేలా లికర్ స్కాంలో వుండడం తెలంగాణ పరువు తీసిందాని అన్నారు. కేంద్రం తెలంగాణకు ఒక్క రూపాయీ ఇవలేదు అని అంటున్న కేటిఅర్, మున్సిపల్ శాక మంత్రిగా గ్రేటర్ హైదరబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో ఎంత నిధులు కేటాయించరాని ప్రశించారు. రాష్ట్ర బడ్జెట్ లో జిహెచ్ఎంసికి 30 కోట్లు కేటాయించరాని ఆ 30 కోట్లు మున్సిపల్ సిబ్బంది జీతాలు, ఇతర వాటికే సరిపోతాయని. మరి హైదరాబాద్ అభివృద్ధి, హైదరాబాద్ లో వున్నా మన మల్కాజ్ గిరి అభివృద్ధి ఎట్లా జరుగుతదాని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్ధిక సంఘం, అమృత్, స్వచ్చ్ భారత్, స్మార్ట్ సిటీ వంటి అనేక పధకాల ద్వారా పట్టణ ప్రాంత అభివృద్ధి కోసం వేల కోట్లు కేంద్ర బిజెపి నరేంద్ర మోది ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందాని తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి కోసం నేషనల్ హెల్త్ మిషన్ కింద వేల కోట్లు ఇచ్చిందని. బిబి నగర్ లో ఎయిమ్స్ కేటాయించిందాని. ఆయుష్మాన్ భారత్ పధకం ద్వారా తెల్ల రేషన్ కార్డు వున్నా ప్రతి కుటుంబనికి ఐదు లక్షల వరకు ప్రైవేటు, కార్పొరేట్ పెద్ద హాస్పిటల్ లలో వైద్య చికిత్స చేయించుకోవచ్చుని తెలిపారు. కరోన సమయం నుండి ఇప్పుడు కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా రేషన్ కార్డు వున్నా ప్రతి ఒక్కరికి ఐదు కిలోల ఉచితంగా బియ్యం ఇస్తున్నారాని అన్నారు.

డబల్ బెడ్ రూమ్ విషయం ఏమో కానీ కేంద్ర బిజెపి నరేంద్ర మోది ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం ద్వారా రెండు లక్షలపైగా ఇండ్లు నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్లు డబ్బులు ఇస్తుందాని, ఇలా కేంద్ర ప్రభుత్వం బిజెపి నరేంద్ర మోది గారి ప్రభుత్వం వివిధ మంత్రుత్వ శాఖల నుండి వివిధ పధకాల ద్వారా తెలంగాణ రాష్ట అభివృద్ధి కోసం నిధులు ఇస్తుంటే వాటి పేర్లు మార్చి తెలంగాణాలో అములు చేస్తున్నారాని. అందులో కూడా పెద్ద స్థాయిలో అవినీతి చేస్తున్నారాని అన్నారు. కరోనతో ప్రపంచం అంత అతలాకుతలం అయితే ప్రపంచంలో ఏ దేశం కూడా ఉచితంగా కరోన టికా ఇవ్వలేదని, రెండు వేలు, మూడు వేలు వుండే కరోన టికా మన దేశంలో బిజెపి నరేంద్ర మోది గారి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందని గుర్తు చేశారు. మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగిడి అక్కడే వునట్లు వుందని. రోడ్లు, చెరువులు శుభ్రం చేయకపోవడం, దోమలు, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వుండడం ఇలా చాల సమస్యలు వున్నాయి అని, మన మల్కాజ్ గిరి చుట్టూ డిఫెన్సు ప్రాంతం, రైల్వే ట్రాక్ లు మధ్యలో వుండడం చాల సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్రంలో, ముఖ్యంగా మన మల్కాజ్ గిరిలో బిజిపి గెలవాలని కేంద్రంలో, రాష్ట్రంలో, మల్కాజ్ గిరి లో ఒక్కటే ప్రభుత్వం ఉంటేనే అభివృది తొందరగా జరుగుతుందని, మన స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే స్థానికంగా వుండే నాయకులకే తెలుస్తుందని. మన శాసనసభ్యుడు, పార్లిమెంట్ సభ్యుడు ఇద్దరు మన స్థానికంగా ఉండరని మన సమస్యలు చెప్పాలన వాళ్ళు అందుబాటులో ఉండరని, వాళ్ళు గెలిచినప్పుడు నుండి ఏ రోజు మన సమస్యల పై అసెంబ్లీలో, పార్లిమెంట్ లో వాళ్ళు మాట్లాడిన సందర్భలు లేవని. ఇప్పటికే స్థానిక సమస్యలపైన సంబంధించిన అధికారులకు బిజెపి ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అని, ఎన్నో నిరసనలు, పోరాటల కార్యక్రమాలు చేసిందని గుర్తుచేసారు.
ఈ కార్యక్రమంలో పోలింగ్ బూత్ అధ్యక్షులు సోమ్నాథ్ చారి, ఐలేష్, అశోక్, బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర మహిళా కన్వీనర్ ఉమా మహేశ్వరి, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ యాదవ్, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఆర్.టి.ఐ సెల్ కన్వీనర్ ఆర్.మణి రత్నం, భజరంగ్, రాములు యాదవ్, మల్లేష్ యాదవ్, అడ్వకేట్ రాము, భాస్కర్, లక్ష్మి నారాయణ, సృకేష్ గౌడ్, శివ గౌడ్, జయమ్మ, విజయ లక్ష్మి, వెంకటేష్, సుమలత, రమేష్, నరేందర్, సూర్యకాంత్, ఆకారం సాయి రామ్, స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.





