వృద్ధులు, మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి

Spread the love

నేర నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి:

రాచకొండ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ ఐ.పి.ఎస్


మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ :01

భువనగిరి జోన్ అధికారులతో బుధవారం జరిగిన క్రైమ్ రివ్యూ మీటింగ్లో భువనగిరి జోన్ పరిధిలో జరిగే నేరాలను అదుపులో ఉంచాలని, నేర నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఐ.పి.ఎస్ ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, వారి బాధలను ఓపికగా విని తగిన న్యాయం చేయాలని సూచించారు.
ప్రతి గ్రామంలో అవసరమైన మేరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వృద్ధులు, మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు, వారి ఫిర్యాదులకు తక్షణమే స్పందించి సత్వర న్యాయం చేకూర్చాలని సూచించారు. భూ కబ్జాదారుల పట్ల, హైవే దిగ్బంధం చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించే వారి మీద పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జోన్ లోని అదికారులతో ఆయా స్టేషన్ల యొక్క పనితీరు గురించి తెలుసుకున్నారు.
యాదాద్రి భువనగిరి డీసీపీ రాజేశ్ చంద్ర ఐ.పి.ఎస్, ఎస్.వెంకట్ రెడ్డి ఏసిపి భువనగిరి, కే.నర్సింహా రెడ్డి ఏ.సి.పి యాదాద్రి, సైదులు ఏ.సి.పి యాదగిరిగుట్ట, ఎన్.ఉదయ్ రెడ్డి ఏసిపి చౌటుప్పల్, భువనగిరి జోన్ సిఐ లు, ఎస్‌.హెచ్‌.ఓ లు, ఎస్‌ఐ లు తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల సందర్బంగా పోలీసులకు సహకరించిన భక్తులకు ధన్యవాదాలు: రాచకొండ కమిషనర్

యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా రాచకొండ పోలిస్ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ ఐ.పి.ఎస్ మంగళవారం సాయంత్రం వరకు బందోబస్తు ఏర్పాట్లను అధికారులతో పాటు సమీక్షించారు. బ్రహ్మోత్సవాల ముగింపు సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణ భక్తులకు ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలియజేశారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి