
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 28.
జాతీయ సైన్స్ డే సందర్భంగా బయ్యరo క్రాస్ రోడ్ నందు గల ఎక్సలెంట్ భాష హై స్కూల్ నందు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు.అందులో భాగంగా విద్యార్థులు అనేక నమూనాలను తయారుచేసి ప్రదర్శన చేయడం జరిగింది.ఆ నమూనాలు విద్యార్థుల సృజనాత్మక శక్తికి అర్థం పటేలా ఉన్నాయి. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బండారు నరేంద్ర మాట్లాడుతూ సైన్స్ నా మతం, జీవితాంతం దానిని ఆరాధిస్తానని చెప్పిన విజ్ఞాన ఘని సర్ సి వి రామన్ అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎక్సెలెంట్ గ్రూప్ అఫ్ స్కూల్ చైర్మన్ యూసుఫ్ షరీఫ్, డైరెక్టర్స్ ఎండీ ఖాదర్, ఎండీ యాకుబ్ షరీఫ్, ముక్కు నరసారెడ్డి, బండారు నరేంద్ర, ప్రిన్సిపాల్ అంకం సురేష్, సీనియర్ ఉపాధ్యాయురాలు వలసలా మోహన్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





