
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 28:
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నాడు బాఖాల్వాడ పాఠశాలలో సైన్స్ టాలెంట్ టెస్ట్, వక్తత్వ పోటీలు మరియు వ్యాస రచన పోటీలు నిర్వహించి సుమారుగా సైన్స్ కు సంబంధించిన 65 ప్రదర్శనలను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని మండల ఎంఈఓ బాలాజీ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. వెంకటరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు

ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ..
విద్యార్థుల సృజనాత్మకత, విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తి పెంపొందించడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి ఉత్తమ ప్రదర్శనలను ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు.. నారాయణరెడ్డి, కె. శ్రీనివాస్ రెడ్డి టి.శ్రీనివాసరెడ్డి రాజు, నాగరాజు,యాదగిరి రెడ్డి, వంగాల శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





