
జనసముద్ర న్యూస్ ప్రతినిధి ,పినపాక, డి. శ్రీనివాస్, ఫిబ్రవరి 28.
కంటి వెలుగు కార్యక్రమాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పినపాక జడ్పిటిసి దాట్ల సుభద్రాదేవి, వాసు బాబు అన్నారు. పినపాక మండలం, టీ.కొత్తగూడెం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు. ప్రజలందరూ తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాసు బాబు , గ్రామ శాఖ అధ్యక్షుడు నరేష్ రెడ్డి, సర్పంచ్ ఇనుకుర్తి నాగలక్ష్మి, కార్యదర్శి అనూష, ఇనుకుర్తి సాంబశివరావు, పాడి ఈశ్వర్ రెడ్డి, వైద్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.





