క్యాన్సర్ తో “అమ్మ” కన్నీళ్లతో కుటుంబం

Spread the love

దాతల సహాయం కోరుతున్న చిన్నారులు.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 28.

రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం,ఇంటి స్థలం లేదు వుండటానికి ఇల్లు లేదు,బ్రతుకుజివుడా అంటూ పొరుగు ఇళ్ళల్లో తల దాచుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో క్యాన్సర్ అనే మహమ్మారి వచ్చి కుటుంబాన్ని అతలా కుతలం చేస్తుంది.ఇద్దరి చిన్నారుల వేదన,అమ్మ కావాలి అనే బాధ పలువురి హృదయాలను కలచివేస్తుంది. దాతల సహాయం కోరుతున్న చిన్నారులు మా అమ్మ ను బ్రతికించమని వేడుకుంటున్న కుటుంబం.
పినపాక మండల పరిధిలో గల పెంటన్నగూడెం గ్రామానికి చెందిన సల్లూరి జ్యోతి వయస్సు30, భర్త ప్రసాద్ వీరికి ఇద్దరు పిల్లలు పావని వయస్సు 12, శెశి కుమార్ వయస్సు 10 .ఆరు నెలల క్రితం బాగా నీరసంగా వుండటంతో హాస్పిటల్ కి వెళ్ళగా డాక్టర్ పరీక్షలు చేసి రక్త శాతము తక్కువ వుందని రక్తము వెక్కించారు. అప్పటి నుండి హాస్పిటల్ కి వెళ్ళే ఆర్థిక స్తోమత లేక అప్పు పుట్టక కుటుంబ పోషణ కోసం నానా కష్టాలు పడుతున్న పరిస్థితులలో కొన్ని రోజుల క్రితం కడుపులో నొప్పి తీవ్రంగా రావడంతో మణుగూరు హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడి డాక్టర్ ఖమ్మం పంపించారు. ఖమ్మం హాస్పిటల్ లో అన్ని పరీక్షలకు డబ్బులు లేక బంధువులను బ్రతిమలాడి 50 వేల అప్పుగా తీసుకొని అన్ని పరీక్షలు చేయించి, ఐ సి యూ లో వారం రోజుల పాటు చికిత్సనందించారు. అక్కడి నుండి హైదరాబాద్ హాస్పిటల్ కి వెళ్ళాలని ప్రయత్నించగా ఊరిలో కొందరి దగ్గర 2 లక్షలు అప్పు చేసి హైదరాబాద్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు.అక్కడ అన్ని పరీక్షలు చేసి గర్భాశయ క్యాన్సర్ నాల్గవ దశలో వుందని చెప్పారు.ఆపరేషన్ చేయాలంటే 6-12 లక్షల వరకు ఖర్చువుంతుందని తెలపటంతో భర్త ప్రసాద్ వద్ద డబ్బులు లేక ఇంటికి తీసుకువచ్చారు. చికిత్స కు డబ్బులు లేక రోజు వాడటానికి మందులు లేక దీనావస్తలో ఉన్న కుటుంబం దినసరి కూలికి వెళ్తే పొట్ట పోసుకునే జ్యోతి కుటుంబానికి ఈ మాయదారి రోగం దాపురించి కుటుంబాన్నీ కల్లోలం పెడుతుంది. ఎవరైనా దాతలు ఆర్థిక సాయం చేసి మా అమ్మ ప్రాణాలు కాపాడాలని ఇద్దరు చిన్నారులు చేతులెత్తి మొక్కుతున్నారు. ఫోన్ పే నెంబర్ 8096327423,దయగల దాతలు వెంటనే స్పందించాలని కన్నీటితో ఆ కుటుంబం వేడుకుంటుంది.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి