
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 28:
మార్చి 1న మధ్యాహ్నం రెండు గంటలకు మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ క్యాంపులో జరిగే రాష్ట్ర గిరిజన సంఘం బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. ఎన్ఎస్పి క్యాంపులో జరిగే బహిరంగ సభ స్థలాన్ని ఆయన పరిశీలించారు.
జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. మార్చి ఒకటి, రెండు, మూడు తేదీలలో మిర్యాలగూడలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మూడవ మహాసభలు జరుగుతున్నాయని అందులో భాగంగా మార్చి 1న మహా ప్రదర్శన, బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి ఎన్ఎస్పి క్యాంపు మైదానం వరకు మహా ప్రదర్శన జరుగుతుందని ఈ ప్రదర్శనలో సుమారు 2000 మంది యువతీ,యువకులు కవాత్ నిర్వహిస్తారని అన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్ఎస్పి క్యాంపు మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలలతోపాటు “తండాల గ్రామాల నుండి” గిరిజనులు పెద్ద ఎత్తున తరలిరావాలని జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగన్న తో పాటు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ నాయక్, జిల్లా అధ్యక్షులు మూడవత్ రవి నాయక్,బాబు నాయక్, నాగేశ్వర్ నాయక్ త దితరులు పాల్గొన్నారు.





