
జనసముద్రం న్యూస్:(ఫిబ్రవరి 26)
హుజురాబాద్ టౌన్.
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల) హుజురాబాద్ లో 2023 -24 విద్య సంవత్సరానికి 2023-24 గాను 5వ తరగతి లో ప్రవేశం పొందడానికి అర్హత గల విద్యార్థులు మార్చి 6వ తేదీ లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మంజుల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు
www.tswreis.telangana.gov.in…వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని,ఒక్క సెల్ ఫోన్ నంబర్ తో ఒక్క దరఖాస్తుకు మాత్రమే వీలుంటుందనీ, అలాగే పాత జిల్లా యూనిట్ గా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు.ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా సంప్రదించాలని సూచించారు.





