
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,పినపాక, ఫిబ్రవరి 26.
పినపాక మండలం ,సింగిరెడ్డిపల్లి పంచాయతీ, దేవనగరం గ్రామంలో కొలువైన బద్ది పోచమ్మ ఆలయం లో ఆదివాసి ఐక్యవేదిక జేఏసీ కన్వీనర్ సోలం అశోక్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆలయ కమిటీ నిర్వాహకులు తోలెం శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పినపాక మండలం ,అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్ విచ్చేసి అదివాసి చిత్ర కళా కళాకారులైన కోటి ఆర్ట్స్ నిర్వాహకులు కొమరం కోటి, సోలం రమణ, పాయం సోమయ్య లను ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంపీటీసీ కాయం శేఖర్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కళాకారులకు సముచిత గుర్తింపు దక్కిందని కళలు జీవం పోసుకుంటున్నాయని అన్నారు. ఆదివాసి చిత్రకళాకారులు బద్ది పోచమ్మ ఆలయంలో పోచమ్మ, సమ్మక్క, సారక్క, బద్దిపోచమ్మల ప్రతిమలను అద్భుతంగా చిత్రీకరించారన్నారు. భవిష్యత్తులో ఆదివాసి చిత్ర కళాకారులు మరింత ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజా కళాకారులు వాగ్గేయకారులు సిద్దల హుస్సేన్, ఆదివాసి జేఏసీ గౌరవాధ్యక్షులు ఇరుపా రామనాదం,ఆదివాసి నాయకులు పర్సిక రామారావు, చింత ముత్తయ్య, దేవరబాల తోలేం నాగయ్య, తోలేం రాంబాబు, తోలేం గోవర్ధన్, మహిళలు పాల్గొన్నారు.





