
జలసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 25.
పినపాక మండలం, ఏడూల్ల బయ్యారం పోలీస్ స్టేషన్ లో ఎస్సై నాగులు మీరాని మర్యాదపూర్వకంగా పినపాక మండల మాల మహానాడు కమిటీ నాయకులు కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై నాగులు మీరా మాట్లాడుతూ యువత పెడదారిన పడుతుందని, రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయని యువత చదువు మీద దృష్టి పెట్టాలని, డ్రగ్స్, మాఫియా, గంజాయి మొదలైన వాటిపై యువత ఆసక్తి చూపుతున్నారని వాటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుదిగొండ రామకృష్ణ, మాల మహానాడు జిల్లా సహాయ కార్యదర్శి దాసరి రవికుమార్, మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు చీకటి రఘు, పినపాక అధ్యక్షులు కోడి రెక్కల రమేష్, తెలి మున్నా, నువ్వుల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.





