
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్ ,కరకగూడెం, ఫిబ్రవరి 26.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, సమత్ భట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బూర్థారం గ్రామంలో సువర్ణ గిరి జ్వాలా లక్ష్మీనరసింహస్వామి ఆలయం, సమ్మక్క సారలమ్మ ఆలయం, శివాలయాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు దర్శించుకుని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.అనంతరం శాలువాతో సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా, పినపాక నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ సంక్షేమంలో అభివృద్ధిలో తెలంగాణను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం మండలం పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.





